పెట్రో ధరలు ఇప్పట్లో తగ్గవు : బాంబు పేల్చిన ధర్మేంద్ర ప్రధాన్

ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (13:32 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా బాంబు పేల్చారు.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతూ ఉన్న ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ పతనం తదితరాల కారణంగా ఇంధన ధరలు మరింతగా పెరగనున్నాయని తెలిపారు. వివిధ అంతర్జాతీయ అంశాలు పెట్రోలు ధరలను ప్రభావితం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
 
కాగా, శనివారం ఆల్ టైమ్ రికార్డుకు చేరిన పెట్రోలు, డీజిల్ ధరలు ఆదివారం మరింతగా పెరిగాయి. ఆదివారం హైదరాబాద్ లీటరు పెట్రోలు ధర 17 పైసలు పెరిగి రూ.83.59కి చేరింది. డాలరుతో రూపాయి విలువ రూ.71 పైన కొనసాగుతోంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు