ఫ్రిజ్‌లో జామకాయలు పెడితే..?

బుధవారం, 28 జనవరి 2015 (16:08 IST)
ఫ్రిజ్‌లో జామకాయలు పెడితే వాటి వాసన పాలరుచిని మార్చేస్తుంది. కాబట్టి ఆ వాసన పోవడానికి  పుదీనా ఆకులుంచితే సరిపోతుంది. ఒక టబ్‌లో నీరుపోసి కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ కలిపి పాత్రల్ని నానబెట్టి తోమితే మరకలు సులభంగా పోతాయి. 
 
సున్నితమైన గ్లాస్ వేర్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు సింకు అంచుల వెంబడి పాతవస్త్రం లేదా టవల్ పరిస్తే వస్తువు పొరపాటున చెయ్యి జారి పడినా పగిలే అవకాశం తక్కువగా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి