చాలామంది బ్రెడ్‌తో శాండ్ విజ్, గారలు వంటి వంటకాలు తయారుచేస్తుంటారు. ఇంకా రకరకాల వంటకాలు చేస్తుంటారు. కొందరికి ఉప్మా అంటేనే నచ్చదు. మరి బ్రెడ్‌తో ఉప్మా చేస్తే నచ్చని వారు కూడా ఉప్మా కావాలని అడుతారు. మరి ఈ బ్రెడ్‌తో ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం.
ఉప్పు - తగినంత
తయారీ విధానం:
ముందుగా బ్రెడ్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తరువాత అల్లం పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 3 నిమిషాల పాటు వేయించి క్యారెట్, బీన్స్, పచ్చి బఠాణీ కొద్దిగా పసుపు వేసి కలుపుకుని కాసేపటి తరువాత బ్రెడ్ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు అలానే ఉంచాలి. చివరగా ఆ మిశ్రమంలో నిమ్మరసం వేసి కలుపుకుంటే వేడివేడి బ్రెడ్ ఉప్మా రెడీ.