మెులకెత్తిన పెసలతో కూర ఎలా చేయాలో చూద్దాం...

గురువారం, 26 జులై 2018 (14:21 IST)
పెసలలో ప్రొటీన్స్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. పెస‌ల‌లో విట‌మిన్ బి, సి, మాంగ‌నీస్ వంటి పోష‌కాలు స‌మృద్ధిగా ఉండ‌డం వ‌లన చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పెసలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌లన శ‌రీర రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పలు ర‌కాల క్యాన్స‌ర్స్ రాకుండా ఉంటాయి. ఇటువంటి పెసలతో కూర ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
పెసలు- ఒక కప్పు 
ఉల్లిపాయలు - 1 
టొమాటోలు - 2 
కారం - 1స్పూన్
జీలకర్ర, ధనియాలపొడి- 1/2 స్పూన్ 
గరంమసాలా - పావు స్పూన్ 
నూనె - సరిపడా 
కసూరి మెంతి- కొద్దిగా 
ఉప్పు- తగినంత
 
తయారీ విధానం:
ముందుగా పెసలు కడిగి రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‍‍‍‍‍‍‍‌లో నూనెను వేసి వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి నిమిషం పాటు వేగించాలి. తరువాత టమోటా ముక్కలను వేసి మరికాసేపు వేగించాలి. ఈ మిశ్రమంలో ధనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు నానబెట్టుకున్న పెసలను వేసి రెండున్నర కప్పుల నీళ్లుపోసి తగినంత ఉప్పు వేయాలి. ఆ తరువాత ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. చివరగా కసూరి మెంతి వేసి బాగా కలుపుకుని కొత్తిమీరను చల్లుకుంటే వేడివేడి పెసలు కూర రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు