పసందైన మష్రుమ్ కట్లెట్స్

మంగళవారం, 4 నవంబరు 2014 (13:46 IST)
ఆయా రుతువుల్లో పువ్వులు, పండ్లు, కూరగాయలు వంటివి కృత్రిమంగా వచ్చేవి. ఏఏ కాలాల్లో పండే వాటిని ఆయా కాలాలలోనే తీసుకోవడం ఉత్తమమంటారు ఆరోగ్య నిపుణులు. అందులో భాగంగా వర్షాకాలంలో మష్రుమ్స్ (పుట్టగొడుగులు) విరివిగా లభ్యమవుతాయి. కనుక పసందైన మష్రుమ్ కట్లెట్స్ మీ కోసం.
 
కావలసిన పదార్థాలు : 
మష్రూమ్స్ (పుట్టగొడుగులు) - 400 గ్రాములు
సన్నగా తరిగిన ఉల్లిపాయ - ఒక కప్పు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్ - 2 టీ స్పూన్లు
బంగాళాదుంప (ఉడకబెట్టి చిదిమినది) - 1 కప్పు
ధనియాలపొడి - 2 టీ స్పూన్లు
ఆమ్‌చూర్ (ఎండబెట్టిన మామిడి పొడి) - 2 టీస్పూన్లు
ఉప్పు - తగినంత
తరిగిన పచ్చి మిర్చి - 2 టీస్పూన్లు
గుడ్లు - రెండు (బాగా గిలక్కొట్టుకోవాలి) 
మైదా - అరకప్పు, బ్రెడ్ అంచులు
 
తయారుచేయండి ఇలా :
ముందుగా బాణలిలో నూనె వేసి అందులో జీలకర్ర, అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి వేగనివ్వాలి. దానిలో మష్రూమ్స్‌ను వేసి అదంతా దానికి పట్టి పొడిపొడిగా అయ్యే దాకా వేయించాలి. తర్వాత దనియాల పొడి, ఆమ్‌చూర్, ఉప్పు, మిరపకాయ ముక్కలు వేసి దానిని 2, 3 సార్లు కలియబెట్టి స్టౌ ఆపేయాలి. చల్లారిన తర్వాత అందులో ఉడకబెట్టి చిదిమిన బంగాళాదుంపను కలపాలి. తర్వాత ఒక కవర్‌పై గుండ్రటి ఆకారంలో చేసుకొని దానిని పిండిలో దొర్లించి తర్వాత గుడ్డు సొనలో ముంచి దానిని పొడి చేసుకున్న బ్రెడ్‌లో పొర్లించాలి. ఇలా రెండు సార్లు చేసిన తర్వాత వాటిని నూనెలో బంగారు రంగు వచ్చే దాకా వేయించి తీసివెయ్యాలి. అంతే పసందైన మష్రుమ్ కట్లెట్స్ రెడీ. వీటిని సాస్ వేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే రుచికరంగా ఉంటాయి. 

వెబ్దునియా పై చదవండి