పాలకూరలో ఐరన్, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉండే.. పాల ఉత్పత్తుల్లో ఒకటైన పనీర్‌లో అంతకుమించిన పోషకాలున్నాయి. పనీర్ తీసుకోవడం ద్వారా కీళ్ళ నొప్పులకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గొచ్చును. క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. బీపీని నియంత్రించవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ముడతలకు చెక్ పెట్టవచ్చు. జుట్టుకు పోషకాలను అందించవచ్చు. ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనీర్‌తో పాలక్ పనీర్ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేయండి..
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
పచ్చి మిర్చి తరుగు - ఒక టీ స్పూన్
మిరప పొడి - రెండు టీ స్పూన్లు
ముందుగా ఓ పాత్రలో పాలకూర, అల్లం, పచ్చిమిర్చిని వేసి 7 నిమిషాల పాటు ఉడికించాలి. ఆపై పాలకూరను దించి పక్కనబెట్టేసుకోవాలి. ఈ మిశ్రమం ఆరిన తర్వాత మిక్సీలో పేస్టులా రుబ్బుకోవాలి. ఆపై స్టౌ మీద బాణలి పెట్టి అందులో నూనె పోసి వేగాక, జీలకర్ర, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి చేర్చాలి. దోరగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి. ఇందులో కాస్త గరం మసాలా పొడి చేర్చి.. రుబ్బి పెట్టుకున్న పాలక్ మిశ్రమాన్ని కలపాలి. తగినంత ఉప్పు, నీరు చేర్చుకుని మరిగించాలి. చివర్లో నేతిలో వేయించిన పనీర్ ముక్కల్ని కూరలో చేర్చుకోవాలి. ఆపై మొక్కజొన్న పిండి, పాలు చేర్చి రెండు నిమిషాలుంచి వెంటనే దించేసుకోవాలి. అంతే పాలక్ పనీర్ రెడీ అయినట్లే. ఈ కూరను వేడి వేడి రోటీలకు, దోసెలకు వడ్డిస్తే టేస్ట్ అదిరిపోతుంది.