క్యారెట్ తురుము... అర కప్పు
క్యాబేజీ తురుము... అర కప్పు
అల్లం, పచ్చిమిరప పేస్ట్... 5 టీస్పూన్లు
పుదీనా, కరివేపాకు తరుగు... ఒక కప్పు
ఉప్పు... సరిపడా
ఉల్లిపాయ తరుగు... అర కప్పు
నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
ముందుగా మినప పప్పు, శనగపప్పులను మూడు గంటలపాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిలో నీటిని ఒంపేసి కొంచెం పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో.. ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, అల్లం పచ్చిమిరప పేస్ట్, పుదీనా కరివేపాకు తరుగు, తగినంత ఉప్పువేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు బాణలిలో నూనెపోసి బాగా కాగిన తరువాత.. పై మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని వడల్లాగా వత్తి వేయాలి. రెండువైపులా బాగా ఎర్రగా కాలిన తరువాత తీసేయాలి. అంతే మినప్పప్పుతో మిక్స్‌డ్ వెజిటబుల్ వడలు రెడీ అయినట్లే...! వీటిని వేడిగా తిన్నా, చల్లారాక తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఇష్టమైనవాళ్లు ఈ వడలను ఎర్రకారం లేదా సాస్‌తో పాటు ఆరగించవచ్చు.