తయారీ విధానం :
ముందుగా వెజిటబుల్ స్టాక్‌ను మరిగించాలి. అందులో సన్నగా తరిగిన పుట్టగొడుగు ముక్కలు, సన్నటి ముక్కలుగా తరుక్కున్న స్వీట్‌కార్న్ ముక్కలను కూడా వేసి కాసేపు మరిగించాలి. ఈ ముక్కలు ఉడికిన తరువాత అందులోనే ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలియబట్టి మరికాసేపు ఉడికించాలి.
చివర్లో కార్న్‌ఫ్లోర్‌లో కొద్దిగా నీళ్లుపోసి పేస్టులాగా చేసి.. పైన ఉడుకుతున్న మిశ్రమంలోనే కలిపి దించేయాలి. సర్వింగ్ బౌల్స్‌లలో ఈ మిశ్రమాన్ని పోసి వేడి వేడిగా అతిథులకు అందించాలి. అంతే వెజిటబుల్ స్వీట్‌కార్న్ మష్రూమ్స్ రెడీ అయినట్లే..! ఎన్నో పోషకవిలువలు కలిగిన ఈ వంటకాన్ని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ..!