"రాజ్‌మా చావల్" భలే టేస్ట్

కావలసిన పదార్థాలు
రెండు కప్పుల రాజ్‌మా, రెండు ఉల్లిపాయలు, రెండు టమేటోలు, జీలకర్ర, అల్లం తురుము రెండు టీ స్పూన్లు, మూడు పచ్చిమిరప కాయలు, ఒక టేబుల్ స్పూను నూనె, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ పసుపు, మూడు టేబుల్ స్పూన్ల కొత్తిమీర, ఒకటిన్నర టీ స్పూన్ నల్ల ఉప్పు, రుచికి తగినంత ఉప్పు

తయారీ విధానం
రాజ్‌మాను రాత్రి అంతా నీటిలో నానబెట్టి వడకట్టేయాలి. ఐదు టీ కప్పుల నీరు పోసి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేవరకూ కుక్కర్‌లో ఉడికించాలి. టొమేటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర గ్రేవి తయారు చేసుకుని పక్కన పెట్టాలి.

నాన్‌స్టిక్ ప్యాన్‌లో నూనె వేడిచేసి జీలకర్ర వేసి చిటపటలాడాక, గ్రేవి పోసి నూనె విడివడేదాకా ఉడకనివ్వాలి. అల్లం తురుము వేసి కొద్దిసేపు ఉడికించాలి. రాజ్‌మా, పసుపు, ధనియాల పొడి, ఉప్పు కలపాలి. నల్లు ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. కొద్ది నిమిషాలు సిమ్‌లో ఉంచి కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి.

వెబ్దునియా పై చదవండి