బాస్మతిబియ్యం : ఒక కప్పు. జీలకర్ర: ఒక టీ స్పూన్. మసాలా ఆకులు: రెండు. లవంగాలు, మిరియాలు: నాలుగు. నీరు: మూడు కప్పులు నిమ్మకాయ: ఒకటి. నెయ్యి: రెండు టీ స్పూన్లు. పసుపు: 1/4 టీ స్పూన్. ఉప్పు, కారం: ఒక టీ స్పూన్. క్యారెట్, మొక్కజొన్న గింజలు: ఒకటిన్నర కప్పులు. క్యాలీప్లవర్, పచ్చిబఠాణీలు, బీన్స్ ముక్కలు: కొన్ని.
తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, మసాలా ఆకులు, లవంగాలు, మిరియాలు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
అనంతరం తరిగిన కూరగాయల ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి వేపాలి. బాగా వేగాక ఈ మిశ్రమంలో మూడు కప్పుల నీరు పోయాలి. ఐదు నిమిషాల తరువాత, నానబెట్టిన బియ్యం కలపాలి. సన్నని మంట మీద బియ్యం ఉడికి, నీరు ఇగిరేవరకు ఉడికించాలి. తరువాత నిమ్మరసం చేర్చాలి ఇక వెరైటీ పులావ్ రెడీ. దీన్ని చికెన్ గ్రేవీ, మటన్ కర్రీలతో సర్వ్ చేయవచ్చు.