రూ. 20 లక్షల వెండి గణపతి... చెన్నై మెరీనాలో నిమజ్జనంకు రెడీ

బుధవారం, 11 సెప్టెంబరు 2013 (13:37 IST)
WD
చెన్నైలోని ఉత్తరప్రాంతమయిన పులియంతోప్ అంటే జనం భయపడిపోతారు. ఈ ప్రాంతం హత్యలకు పెట్టిందిపేరు. అలాంటి పులియంతోప్ ప్రాంతవాసులు గణేష్ చతుర్థి సందర్భంగా రూ. 20 లక్షలు వెచ్చించి వెండి గణపతిని రూపొందించారు. ఈ వెండి గణనాధుని బరువు 19.03 కిలోలు. విశేషమేమంటే, ఈ వెండి గణపతిని చెన్నై మెరీనా సముద్ర తీరంలో నిమజ్జనం చేసేందుకు స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వారాంతంలో జరగబోయే నిమజ్జన కార్యక్రమంలో వెండి గణపతిని నిమజ్జనం చేయబోతున్నట్లు ఏసీపి పి.లోకనాథన్‌కు సమాచారం అందించారు. సముద్రంలోపల 10 కిలోమీటర్లు దూరం తీసుకెళ్లి విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నట్లు స్థానికులు తెలిపారు.

3 అడుగులు ఎత్తు ఉన్న వెండి గణపతికి భద్రతగా ముగ్గురు పోలీసులు, ఒక డీఎస్పీ ఉన్నారు. కాగా వెండి గణపతిని కర్నాటకలోని మైసూరు, రాజస్థాన్ ఉదయపూర్ నుంచి నిపుణులను రప్పించి తయారుచేసినట్లు గణేష్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నవారు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి