Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య నాడు జ్యోతిష్యం ప్రకారం ఈ యోగాలు

సెల్వి

బుధవారం, 23 జులై 2025 (19:31 IST)
Ashadha Amavasya
ఆషాఢ అమావాస్య రోజున సత్యనిష్టతో, భక్తి శ్రద్ధలతో ఈ ఆచారాలను పాటించడం వల్ల సకల దోషాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజున వృద్ధి యోగం, వేషి యోగం, గురు ఆదిత్య యోగం వంటి శుభ కలయిక ఉంటుంది.
 
దీనితో పాటు ఆషాఢ అమావాస్య నాడు గజ కేసరి యోగం ఏర్పడింది. ఈ రోజు పవిత్ర నదిలో లేదా బావిలో స్నానం చేయడం, ధ్యానం చేయడం, పూజ చేయడం, దానధర్మాలు చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
ఆషాఢ మాసం గ్రామ దేవతలకు ప్రీతికరమైనది కాబట్టి.. ఈ రోజున గ్రామదేవతలను పూజించడం ఎంతో శుభప్రదం. అలాగే ఈ రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే పెద్దలను అగౌరవంగా మాట్లాడకూడదు. కొత్తగా శుభకార్యాలు ప్రారంభించకూడదు. 
 
ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, చీపురు కొనడం వంటివి మానుకోండి. మాంసాహారం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు