వినాయక చవితి: గణపతికి తెల్ల జిల్లేడు పువ్వుల మాల సమర్పిస్తే..?

శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (22:57 IST)
ఆదిదేవుడు గణపతిని పూజించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గణేశ చతుర్థి రోజున 21 ఆకులు, 21 పువ్వులు, 21 గరికలతో గణపతికి పూజ చేస్తే సర్వం సిద్ధిస్తుంది. వినాయక చతుర్థి రోజున తెల్ల జిల్లేడు పువ్వుల మాలను వినాయకుడికి సమర్పిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. తెల్ల జిల్లేడు పువ్వు సూర్య గ్రహానికి చెందినది. అన్ని రకాల ప్రతికూల శక్తులను దూరం చేసే శక్తి దీనికి ఉంది. 
 
కాబట్టి గణేష చతుర్థి రోజున తెల్ల జిల్లేడు మాలను సమర్పించడం ద్వారా ఆ ఇంట గల సంతానం విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఆ ఇంట గల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. కార్యసిద్ధికి వున్న అడ్డంకులు తొలగిపోతాయి. జాతకంలో సూర్యుని స్థానం వల్ల కలిగే నష్టాలు, ప్రతికూలతలు తొలగిపోతాయి. సూర్యభగవానుని అనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక బలం, ఆరోగ్యం కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు