వినాయక చవితి పూజకు ఏ విగ్రహం మంచిది?

శనివారం, 31 ఆగస్టు 2019 (11:13 IST)
భౌతిక బలం కంటే బుద్ధిబలం గొప్పదని చాటి చెప్పిన విజ్ఞుడు విఘ్నేశ్వరుడు. పట్టుదల, బుద్ధిబలం వంటివి గణనాథునిలో ఉండటంతోనే గణాధిపతి అయ్యాడని పురోహితులు అంటున్నారు. 
 
పధ్నాలుగు లోకాల్లోని యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, సురాసురులు, మానవాది సమస్త జీవులతో పాటు త్రిమూర్తులచేత, ముగ్గురమ్మలచేత పూజలందుకునే వినాయకమూర్తిని పూజించేందుకు ఏ విగ్రహము శ్రేష్టమైందో తెలుసా? గురువులకు గురువైన గణేశుడిని రాగి విగ్రహ రూపంలో పూజిస్తే ఐశ్వర్యం లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు.
 
అలాగే వెండివినాయకుడిని పూజిస్తే ఆయుర్‌వృద్ధి కలుగుతుందని, బంగారు విగ్రహ రూపంలో గణపతిని పూజిస్తే సంకల్పం సిద్ధిస్తుందని విశ్వాసం.
 
అలాగే మట్టితో చేసిన విగ్రహానికి నవరాత్రులు పూజలు చేసి నీటిలో నిమజ్జనం చేస్తే.. వరసిద్ధి, ఆయువు, ఐశ్వర్యం, జ్ఞానసిద్ధి, సంకల్పసిద్ధి, ధన, కనక, వస్తు, వాహనాలు, ఐహికపర సుఖాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. 
 
ఇకపోతే.. ప్రతిరోజూ పూజలో గణపతిని పసుపు ముద్దతో చేసి పూజించడం ద్వారా అన్ని విఘ్నాలు తొలగిపోయి, ప్రశాంత జీవనం లభిస్తుంది. ఇంకేముంది..? మనం కూడా వినాయక చతుర్థినాడు గణపతిని నిష్టతో ప్రార్థించి.. స్వామివారి అనుగ్రహం పొందుదాం..!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు