రోజుకు గంట సేపు.. 10వేల అడుగులు నడిస్తే.. బరువు మటాష్

బుధవారం, 10 మే 2023 (18:02 IST)
శరీరంలో కొలెస్ట్రాల్ చేరకుండా వుండాలంటే.. ఒబిసిటీ దరిచేరకుండా వుండాలంటే రోజుకు గంట పాటు నడవాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మహిళలు రోజుకు గంట పాటు నడక కోసం సమయం కేటాయించాల్సిందేనని వైద్యులు చెప్తున్నారు. 
 
ప్రతిరోజూ గంటసేపు నడవడం వల్ల క్యాలరీలు బర్న్ అవుతాయి. కొవ్వు తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గవచ్చు. నడుస్తున్నప్పుడు వేగం పుంజుకోవడం పెద్ద మార్పును కలిగిస్తుంది. వేగంగా నడవడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. 
 
సాధారణ వాకర్ల కంటే రన్నర్ల శరీర బరువు తక్కువగా ఉంటుందని అధ్యయనం సూచించింది. చదునైన ఉపరితలంపై నడవడం కంటే కొంచెం ఎత్తులో నడవడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. ఇందుకోసం కొండ ప్రాంతాలకు 'ట్రకింగ్' చేయవచ్చు. 
 
ప్రతిరోజూ 10,000 అడుగులు నడవడం వల్ల బరువు తగ్గవచ్చు. ఈ సంఖ్యను పెంచడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. అయితే శరీరం అలసిపోయేలా చేస్తే ఎక్కువ దూరం నడవడం మానేయడం మంచిది. కొంచెం కొంచెంగా నడక సమయాన్ని పెంచుకుంటూ పోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు