ఒత్తిడితో మహిళల్లో సంతాన ప్రాప్తి ఆలస్యం... దూరం...

శుక్రవారం, 27 మే 2016 (17:39 IST)
విపరీతమైన ఒత్తిడి... ముఖ్యంగా మహిళల్లో ఈ ఒత్తిడి సమస్య అధికంగా ఉంటే సంతానం కలిగే అవకాశాలు తగ్గుతాయని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. అధ్యయనం చేసినవారిలో 38 శాతం మందిలో ఇలాంటి ఫలితాలు వచ్చినట్లు కనుగొన్నారు. ఒత్తిడి సమస్య లేకుండా ఉన్న మహిళల్లో సంతాన ప్రాప్తి ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 
 
మానసిక ఒత్తిడికి గురయ్యే వారిలో తరచూ వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనీ, కొందరు పెయిన్ కిల్లర్స్ వంటివి వేసుకోవడం కారణంగా వారికి సంతాన ప్రాప్తి తగ్గుతున్నట్లు వెల్లడయిందన్నారు. అలాగే మరికొందరిలో ఈ ఒత్తిడి సమస్య కారణంగా గర్భం దాల్చేందుకు కొన్ని సంవత్సరాల సమయం పడుతున్నట్లు కూడా గమనించారు. అందువల్ల మహిళలు ఒత్తిడి లేకుండా ఉల్లాసంగా ఉండాలని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తుందని వారు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి