మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. దీనినే ఎండోమెట్రిక్ క్యాన్సర్ అని కూడా అంటారు. గర్భాశయ క్యాన్సర్‌కు అధిక రక్తస్రావం, నెలసరి సమయాల్లో కడుపునొప్పి, నెలసరి ముగిసినా శరీర బరువు పెరగడం వంటివి ప్రధాన లక్షణాలు. వంశపారంపర్యంగానూ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా శరీరంలో చక్కెర శాతం పెరిగినా, బరువు పెరిగినా గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అయితే గర్భాశయ క్యాన్సర్‌ను దూరం చేసుకోవాలంటే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించుకోవాలి. కాయగూరలను అధిక శాతంలో తీసుకోవాలి. పచ్చిబఠాణీలను ఆహారంలో చేర్చుకోవచ్చు. రోజూ వారీ డైట్‌లో పండ్లను తీసుకోవాలి. ఉడికించిన కూరగాయలను తీసుకోవచ్చు. కానీ పీచు పదార్థాలు అధికంగా ఉండేవి తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాయగూరల్లో క్యాబేజీ, కాలిఫ్లవర్, మొలకెత్తిన విత్తనాలు తీసుకోవచ్చు.
అలాగే పసుపు, ఎరుపు రంగు పండ్లను అధికంగా తీసుకుంటూ వుండాలి. వీటిద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆపిల్, నిమ్మపండు, టమోటా, బత్తాయి పండ్లలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అలాగే బాదం, పిస్తా వంటి నట్స్ కూడా తీసుకోవచ్చు. చేపలు అధికంగా తీసుకోవచ్చు. అయితే చేపలు వేపుడు రూపంలో గాకుండా ఉడికించి తీసుకోవాలి. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు.