పొటాషియం అధికంగా ఉన్న ఇతర ఆహారాలలో అవకాడో, పాలకూర, చిలగడదుంప, నారింజ, సాల్మన్, ఆప్రికాట్లు, బ్రోకలీ ఉన్నాయి. ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన ఎంపికలను ఎలాంటి ఆహారంలోనైనా సులభంగా చేర్చుకోవచ్చు. ఇవి కూడా రక్తపోటును తగ్గిస్తాయి.
అరటిపండ్లు లేదా బ్రోకలీ లాంటి పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవడం, సోడియంను తగ్గించడం కంటే రక్తపోటుపై మంచి సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడింట ఒక వంతు పెద్దలను అధిక రక్తపోటు ప్రభావితం చేస్తుంది.
ఇది గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, మతిమరుపు లాంటి అనేక పరిస్థితులకు ప్రమాద కారకం. కాబట్టి వీటిని దూరం చేసుకోవాలంటే పొటాషియంతో నిండిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.