మహిళలు నెలసరి రోజుల్లో ఒక గ్రాము అల్లం పొడిని తీసుకుంటే?

బుధవారం, 29 మార్చి 2017 (15:23 IST)
కండరాల్లో ఏర్పడే నొప్పులను దూరం చేయడంలో అల్లం భేష్‌గా పనిచేస్తుంది. ఇందులోని ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంటల్లో అల్లాన్ని ఉపయోగించడం ద్వారా శరీరంలో ని కొవ్వును కరిగిస్తుంది. రోజులో కనీసం ఒక లీటర్ వరకైనా జింజర్ వాటర్ తాగాలి. నిత్యం ఈ వాటర్ ను తాగుతుంటే కొద్ది రోజుల్లో అధికంగా పేరుకపోయిన కొవ్వు కరుగుతుందంట.
 
అల్లం ముక్కను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే తగ్గుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  అలాగే షుగర్ లెవల్స్‌ను తగ్గించి హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
 
ఇంకా డయాబెటిస్ టైప్ 2ను నయం అవుతుంది. ఇంకా మహిళల్ని వేధించే నెలసరి సమస్యలను తొలగించుకోవాలంటే.. నెలసరి రోజుల్లో రోజుకు ఒక గ్రాము అల్లంపొడిని మూడు రోజుల పాటు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్ నియంత్రణ, శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించే అల్లంను ప్రతీరోజూ వంటల్లో వాడటం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని వారు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి