4. చామనఛాయ లేదా కాస్త రంగు తక్కువగా వారైతే గులాబీ, నారింజ, గంధపు రంగు, ఎరుపు రంగు బొట్టు కళగా వుంటాయి. కళ్ళు పెద్దవిగా ఉంటే పెద్ద బొట్టు, చిన్నగా ఉంటే కొంచెం చిన్నసైజు బొట్టు శోభాయమానంగా వుంటుంది.
5. నుదురు పెద్దగా ఉన్నవారు పెద్ద బొట్టు పెట్టుకుంటే నుదురు పెద్దగా వున్న విషయం అంతగా తెలీదు. చిన్నవాళ్ళకి రకరకాల ఆకృతులు, మ్యాచింగ్ రంగుల బొట్టు పెట్టుకున్నా బావుంటుంది. కానీ మధ్య వయసు వారికి ఎరుపు, పింక్ వంటి రంగులు, గుండ్రటి బొట్టు నిండుదనాన్నిస్తుంది. పొట్టిగా వున్నవాళ్ళు పొడుగు బొట్టు పెట్టుకొంటే అందంగా, హుందాగా కనిపిస్తారు.