ఆ యాడ్ షూటింగ్ సందర్భంగా ఆ బాలుడు స్వరాను 'ఆంటీ' అని పిలిచాడట. దానిని గుర్తు చేసుకున్న స్వరా ఆ బాలుణ్ని నోటికొచ్చినట్టు బూతులు తిట్టింది. ఆ షూటింగ్ తనకు చాలా నిరాశ కలిగించిందని, బాలుడు తనను 'ఆంటీ' అని పిలవడమేంటని ప్రశ్నించింది.
అంతేకాదు 'పిల్లలు దెయ్యాలతో సమానం కదా?' అంటూ వ్యాఖ్యానించింది. స్వర చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలపాలవుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారిని కెమెరా ముందు దారుణంగా తిట్టడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వరా వ్యాఖ్యలపై ఓ స్వచ్ఛంద సంస్థ ఏకంగా జాతీయ బాలల హక్కు కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం.