గోళ్లు పెరిగినప్పుడు గోళ్ళను కత్తిరిస్తాం..?

శుక్రవారం, 21 డిశెంబరు 2018 (12:21 IST)
1. చదువులో ఆనందాన్ని పొందితే జీవితంలో..
ఉన్నతి శిఖరాలను చేరుకుంటాం..
 
2. గోళ్లు పెరిగినప్పుడు గోళ్ళను కత్తిరిస్తాం.. వేళ్ళను కాదు కదా..
అలానే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి కానీ.. బంధాన్ని కాదు..
 
3. ఫోటో కోసం చిందించే చిరునవ్వు.. ఫోటో అందాన్నే మార్చగలిగితే.. 
అదే చిరునవ్వు జీవితాంతం కొనసాగిస్తే జీవితం ఇంకా అందంగా ఉంటుంది..
 
4. ఒక నిజాన్ని నమ్మించడానికి అబద్ధాలు అవసరం లేదు.. కానీ 
అబద్ధాన్ని నమ్మించడానికి అబద్ధాలు అవసరం..
 
5. అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది..
భయంకరమైన మౌనాన్ని ఒక్కమాట తుడిచివేస్తుంది..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు