చాలామంది మేకప్ వేసుకుంటారు గానీ దానిని సరిగ్గా శుభ్రం చేసుకోరు. ఇలా చేస్తే.. పలురకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు. దాంతో చర్మమంతా ముడతలుగా మారి.. చూడడానికే విసుగుగా ఉంటుంది. ఇక ఎప్పుడూ మేకప్ వేసుకున్నా మీ ముఖం ముడతలుగానే ఉంటుంది. అందువలన వీలైనంతవరుకు నిద్రించే ముందు మేకప్ తొలగిస్తే మంచిది. మరి మేకప్ ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం..
1. పావుకప్పు గోరువెచ్చని పాలలో కొద్దిగా తేనె, వంటసోడా, కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకుని గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మేకప్ పోతుంది. దాంతో చర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.
3. ఆపిల్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని నీటిలో మరిగించుకోవాలి. ఆపై ఆ నీటిలో కొద్దిగా వంటసోడా, ఉప్పు కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. రెండుగంటల తరువాత కడుక్కుంటే ఫలితం ఉంటుంది.