బిజినెస్ వుమెన్ అవార్డు పొందిన వినీతా సింఘానియా

సోమవారం, 21 డిశెంబరు 2009 (14:40 IST)
దేశీయ సిమెంట్ నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న జేకే లక్ష్మీ సిమెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వినీతా సిఘానియాను పీహెచ్‌డీ ఛాంబర్ ఔట్‌‍సోర్సింగ్ బిజినెస్ వుమెన్ అవార్డుతో సన్మానించనుంది.

ప్రతియేటా అందించే ఔట్‌‍సోర్సింగ్ బిజినెస్ అవార్డులో భాగంగా ఈ ఏడాది వినీతా సిఘానియా, జుబిలేట్ ఆర్గానోసిస్‌లకు డిసెంబర్ 23న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.

తాము నిర్వహించే వార్షిక సమావేశ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని వీరీతోపాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా పాల్గొంటారని నిర్వాహకులు వివరించారు.

వెబ్దునియా పై చదవండి