మహిళలకు 30 శాతం రిజర్వేషన్: జర్మన్ కంపెనీ

FILE
ప్రస్తుతం భారతదేశంలో మహిళామణులకు రిజర్వేషన్ కల్పించేందుకు పలు రాజకీయ పార్టీలు విముఖత ప్రదర్శిస్తున్నాయి. దీంతో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ఆమోదించలేకపోతోంది. కాని జర్మనీకి చెందిన టెలికాం కంపెనీ డ్యూత్సే టెలికాం సంస్థ ఈ దిశగా అడుగులు వేస్తోంది. మహిళలకు రిజర్వేషన్ కల్పించి ఉద్యోగావకాశాలు తగిన స్థానం కల్పించేందుకు ఆ సంస్థ ప్రణాళికలు రూపొందించుకుంది.

తమ సంస్థ మహిళలకు ప్రత్యేక కోటా కల్పిస్తున్నామని జర్మనీకి చెందిన టెలికాం కంపెనీ డ్యూత్సే సంస్థ సోమవారం వెల్లడించింది. డేక్స్-30 కంపెనీల్లో ఇది ఒక కంపెనీ. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రధాన కార్యనిర్వహణాధికారి రెనే ఓబెర్మాన్ మాట్లాడుతూ వచ్చే ఐదు సంవత్సరాలలో తమ కంపెనీలో ముఫై శాతం మంది మహిళామణులను నియమిస్తామని తెలిపారు.

ప్రస్తుతం తమ కంపెనీలో కేవలం 13 శాతం మాత్రమే మహిళలు ఉన్నత పదవులలో ఉన్నారని, ఈ సంఖ్యను మరింత పెంచేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఉన్నత పదవులలో మహిళలను నియమించడంతో తమ సంస్థ మరింతగా వృద్ధి చెందగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి