ముఖారవిందానికి కొబ్బరి నూనె

సోమవారం, 1 ఫిబ్రవరి 2010 (20:06 IST)
FILE
ముఖానికి మేకప్ వేసుకోవడం చాలా సులభం. కాని దానిని తీయడమనేది చాలా ఇబ్బందితో కూడుకున్న అంశం. మేకప్ చేసుకున్న తర్వాత ఒక వేళ దానిని సరైన పద్ధతిలో తీయకపోతే మేకప్ చర్మానికి హాని చేస్తుంది. కళ్ళవద్దనున్న మేకప్‌ను సుభ్రపరిచేందుకు కాటన్ బాల్‌‍పై కాసింత కొబ్బరి నూనెను వేసుకుని మీ చేతులతో కళ్ళక్రిందనున్న మేకప్‌ను తొలగించండి.

ఒకవేళ ముఖంపై మచ్చలుంటే లేదా మోచేతుల వద్ద నల్లటి మచ్చలుంటే బాధపడాల్సిన పనిలేదంటున్నారు బ్యుటీషియన్లు. అరచెంచా కొబ్బరి నూనెలో నిమ్మచెక్క రసాన్ని పిండుకోండి. ఈ మిశ్రమాన్ని శరీరంపై ఎక్కడైతే నల్లటి మచ్చలుంటాయో అంటే మోచేతులు, ముఖం, కాళ్ళ వద్ద రుద్దండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ఆ ప్రాంతాన్ని కడిగేయండి. దీంతో మీ శరీరంపైనున్న నల్లటి మచ్చలు తొలగిపోతాయంటున్నారు వైద్యులు.

వెబ్దునియా పై చదవండి