సామాజిక సేవలో సామాన్య మహిళ పద్మజా రెడ్డి

బుధవారం, 7 అక్టోబరు 2020 (12:48 IST)
రాజకీయనాయకులు, అధికారులు, స్వచ్చంధ సంస్థల నిర్వాహకులు వీరంతా సమాజంలోని ప్రజలకు తమవంతుగా ఏదొక విధంగా సేవలు అందిస్తుంటారు. అయితే వీరంతా ఏదొక రూపంలో తాము చేసిన సేవలకు ప్రతిఫలం పొందుతారు. కానీ కొందరు మాత్రం ప్రజల సేవే మార్గంగా.. తమ ఉదారతను చాటుకుంటారు. సమాజ సేవే లక్ష్యంగా బతుకుతుంటారు. సరిగ్గా అదే కోవకు చెందినవారు సరిపల్లి పద్మజారెడ్డి.
 
పరులకు ఉపకారం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటారామె. పబ్లిసిటీలో విషయంలో వెనకుంటారు. "కుడి చేత్తో చేసిన సాయం ఎడం చేతికి కూడా తెలియకూడదంటారు కదా...! అదే సూత్రాన్ని పాటిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన సరిపల్లి పద్మజారెడ్డి. కష్టాల్లో ఉన్న ప్రజలకు అడగక ముందే సాయమందిస్తూ వాడవాడలోనూ... వీధి వీధిలోనూ... వేలాది మందికి తన వంతు సాయం అందిస్తున్నారామె.. ఎటువంటి లాభాన్ని ఆశించకుండా పలు సేవాకార్యక్రమాలు చేస్తున్నారు పద్మజారెడ్డి.
అసలు ఎవరీ సరిపల్లి పద్మజారెడ్డి?
హైదరాబాద్ నగరానికి చెందిన సరిపల్లి పద్మజారెడ్డి... కరోనా కష్టకాలంలో ఆమె ఏమాత్రం భయపడలేదు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ప్రజల మధ్యనే తిరుగుతూ వారికి అండగా నిలిచారు. మన హైదరాబాద్‌లో వేలాది మంది ఆకలితీర్చడమే కాకుండా, ఆర్థిక సాయం చేస్తున్నారీ సామాన్య మహిళ. జనం "పద్మక్క" అంటూ పిలుచుకునే సరిపల్లి పద్మజా రెడ్డి ఎంతో కాలంగా బాలానగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఎవరికి ఏం కావాలన్నా తన స్థాయికి తగినట్లు సాయం అందిస్తున్నారు.
 
“వ్యవసాయం కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆమెకు సామాన్య ప్రజలు పడే కష్టాలను చాలా బాగా అర్థం చేసుకోగలరు. అందుకోసమే తన వంతు సాయంగా ప్రజలకు ఏదొక విధంగా సాయపడాలనే సదుద్దేశంతో పరులకు ఉపకారం చేస్తున్నారు సరిపల్లి పద్మజారెడ్డి. పదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థులు, సింగిల్ మదర్స్, దివ్యాంగులు, వయోవృద్ధులు, అనాధలు, మానసిక వికలాంగులకు సేవలందిస్తున్నది కోటి గ్రూప్ వారి సేవా ఫౌండేషన్. ఈ సంస్థకు పద్మజా రెడ్డి ట్రస్టీగా ఉన్నారు.
 
సేవా ఫౌండేషన్ సహకారంతో పాటు, కోటి గ్రూప్‌కు చెందిన భారత్ హెల్త్ కేర్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ల  సంయుక్తాధ్వర్యంలో "బ్లడ్ డాట్ లైవ్"ను ప్రారంభించగా దీని ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ఎంచుకున్నారు. ప్రాణాల కోసం పోరాడుతూ రక్తం అవసరం ఉన్నవారిని - వారి చుట్టు ప్రక్కలనే ఉన్న స్వచ్చంద రక్త దాతతో అనుసంధానం చేసి రక్తదానాన్ని ప్రాణదానంగా మార్చడమే బ్లడ్ డాట్ లైవ్ ఉద్దేశ్యం.
రక్తం పంచి ఇద్దరు పిల్లలను కన్నతల్లిగా ప్రాణం విలువేంటో తెలిసిన దానిగా, భారతదేశంలోనే కాదు… ప్రపంచ వ్యాప్తంగా నా తోటి అక్కాచెల్లెమ్మలు కూడా ఎటువంటి సెక్యూరిటీ, ప్రైవసీ ఇబ్బందులు లేకుండా మన చుట్టూ ఉన్నవారి ప్రాణాలను కాపాడే విధంగా బ్లడ్ డాట్ లైవ్ రియల్ టైం లైఫ్ సేవింగ్ ప్లాట్ఫామ్ తయారు చేశామని చెబుతున్నారు పద్మక్క.
 
కరోనా నేపథ్యంలో బాధితులకు సాయం అందించడానికి ప్లాస్మా డొనేషన్ చేసే వారి వివరాలను సేకరించి స్వచ్ఛంద సంస్థలకు అందించారు. మహిళల్లో పలు అంశాలపై అవగాహన కల్పించేవిధంగా పద్మజా రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆడవాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవడమేకాదు.. అవసరమైతే అవకాశాలు సృష్టించాలంటూ మహిళా లోకాన్ని ముందుకు నడిపిస్తున్నారు సరిపల్లి పద్మజారెడ్డి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు