కామన్వెల్త్ గేమ్స్: చరిత్ర సృష్టించిన సైనా నెహ్వాల్

PTI
దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె రికార్డు నెలకొల్పింది. గురువారమిక్కడ హోరాహోరీగా జరిగిన ఫైనల్లో మలేసియా క్రీడాకారిణి మీచూ వాంగ్‌పై సైనా విజయకేతనం ఎగురవేసింది.

వీరిద్దరు మొదటి రెండు సెట్లలో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. ఫలితంగా ఈ రెండు సెట్లలో తలా ఒక్కొక్కటి చొప్పున గెలుచుకున్నారు. దీంతో కీలకమైన మూడో సెట్‌ ఆడాల్సి వచ్చింది. ఇందులో సైనా పైచేయి సాధించారు. మ్యాచ్ మొత్తాన్ని 2-1 తేడాతో విజయం సాధించింది. సైనా సాధించిన స్వర్ణంతో పాయింట్ల పట్టికలో భారత్ మళ్లీ రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 38 బంగాకు పతకాలు చేరాయి.

వెబ్దునియా పై చదవండి