రెండు అరచేతులను భూమిపై పెట్టి మోచేతులపై పైకి లేచి శరీరాన్ని భూమికి సమాంతరంగా ఓ బద్దలా ఉండేటట్లు చేయటాన్ని మయూరాసనం అంటారు. సంస్కృతంలో మయూరమంటే నెమలి అని అర్థం. ఎవరైతే మోచేతులపై తమ బరువునంతా మోస్తూ భూమికి సమాంతరంగా ఓ బద్దలా ఉండగలుగటాన్ని మయూరాసనంగా చెపుతారు. ఈ ఆసనం చిత్రంలో చూపినట్లు మయూరాన్ని పోలి ఉంటుంది.
ఆసనం వేసే పద్ధతి చేతులను కింద ఆనిస్తూ మోకాళ్లను కాస్త భూమికి తాకేవిధంగా ముందుకు వంగి కూర్చోండి. మీ చేతివెళ్లను భూమికి తాకిస్తూ రెండు అరచేతులను భూమిపై ఉంచండి. అయితే ఈ దశలో మీ చేతివేళ్లు వెనుకకు తిరిగి ఉండేటట్లు అరచేతులను ఉంచండి. మోచేతుల వద్ద మడిచి బలంగా ఉంచండి మెల్లగా రెండు కాళ్లను సమానంగా కాస్తంత దూరంగా జరిపి జాగ్రత్తగా ముందుకు జరిగి మెల్లగా వీపు భాగాన్ని పైకి లేపండి వీపు భాగాన్ని పైకి లేపిన తర్వాత, మీ కాళ్లను దగ్గరకు జరిపి నిటారుగా ఓ బద్దలా ( భూమికి సమాంతరంగా) ఉంచుతూనే మీ వక్షస్థలం, మెడ, తల భాగాలను కూడా భూమికి సమాంతరంగా ఉంటేట్లు చేయండి. అలానే కొంతసమయం చేసి తిరిగి మొదటి స్థానానికి వచ్చేయండి. మెల్లగా కాళ్లను మడిచి మోకాళ్లను భూమిపై పెట్టండి. ఇప్పుడు చేతులను భూమిపై నుంచి తీసివేసి మమూలుగా కూర్చోండి.
WD
జాగ్రత్తలు ఇది చాలా జాగ్రత్తగా సమతూకంగా చేయాల్సిన ఆసనం మొత్తం శరీరం బరువంతా కేవలం చేతులపై ఉంటుంది కనుక ఎప్పుడైనా బ్యాలన్స్ కోల్పోయే అవకాశం ఉంది. కనుక ఈ ఆసనం వేయటానికి శిక్షణ అవసరం ఆసనం వేసే సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ శరీరాన్ని ఒకేసారిగా కదలించటం చేయకూడదు. ఆసనం వేసేటపుడు దగ్గు వస్తున్నా ఆయాసంగా ఉన్నా తిరిగి శిక్షణను ప్రారంభించండి.
ఉపయోగాలు మరియు నిబంధనలు విసెరోప్టోసిస్, డైస్పెప్సియా వంటివాటికి విరుగుడుగా పనిచేస్తుంది మయూరాసనం. అంతేకాదు మదుమేహం వున్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సర్వికల్ స్పాండిలిటీస్ సమస్య ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకూడదు.