పేరు వింటేనే నౌకాసనం ఎలా ఉంటుందనే విషయంపై మీకు ఈపాటికే ఓ అవగాహన వచ్చి ఉంటుంది. అవును నౌకాసన భంగిమ నౌకలాగే ఉంటుంది. ఇందులో అవలంభించే పద్ధతి కొద్దిపాటి తేడాలు మినహాయించి ఊర్ధ్వ పాద హస్తాసన భంగిమలాగే ఉంటుంది.
ఆసన వేసే విధానం: • నేలపై అలాగే శరీరం సమతలంగా ఉండేలా పడుకోవాలి. • మీ రెండు చేతులను మీ తొడలపై (ఊర్ధ్వపాద హస్తాసనలో ఉన్నట్టు) పెట్టాల్సిన అవసరం లేదు. • దానికి బదులు మీ భుజాలను తలదాకా చాచాలి. • ఎగువ భుజాలు చెవులను తాకుతున్నట్టు ఉండాలి. • గాలి పీలుస్తూ మీ కాళ్లు, నడుము, భుజాలు, మెడ, తల, అలాగే నేల నుంచి 60 డిగ్రీల కోణంలో పైకి లేపాలి. • ఇలా చేసేటపుడు భుజాలను నేరుగా ఉంచండి. • అలాగే మీ పాదాల వేళ్లకు సమాంతరంగా మీ భుజాలను ఉంచాలి. • కాళ్ల వేళ్లు చేతికొనలకు సమాన స్థాయిలో ఉండాలి. • మీ చూపును కాలి మొనలపైనే శ్రద్ధంగా పెట్టండి. • ఈ సమయంలోనే మీ శరీరం మీ వెన్నును ఆధారంగా చేసుకుని ఉంటుంది. • శ్వాస గట్టిగా బిగపట్టండి. • ఇలాగే ఓ ఐదు నిమిషాల పాటు నిలవండి. • ఇపుడు మీ శరీరం నౌకాకృతిని సంతరించుకుంటుంది. ఇలా చేయడాన్నే నౌకాసనంగా చెబుతున్నారు. • నెమ్మదిగా శ్వాస బయటకు వదులుతూ ఆ స్థితి నుంచి ప్రారంభ స్థితికి రండి.
WD
ప్రయోజనాలుః • ఈ నౌకాసన భంగిమ ద్వారా ఉదరం, వెన్ను, భుజ, మెడ, కింది భాగంలోని అవయవాలను పటిష్ట పరుస్తుంది. • వెన్ను సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. • ఛాతీ భాగం వెడల్పయ్యేలా చేసి, మీ ఊపిరితిత్తులు బలపడేలా చేస్తుంది. • ఈ ఆసనం వెన్ను చివరి భాగం, కాళ్లు, మోకాలి కింది కండరాలు, మోకాళ్లు, తొడలు, భుజాలు, నడుము భాగాలకు మంచి శక్తిని అందిస్తుంది.