నిలువెత్తు తెలుగుదనానికి నిలువుటద్దం వైఎస్

File
FILE
హెటెక్ ప్రపంచం. యువత కొత్త పుంతలు తొక్కుతున్న కాలం. మాతృభాషను మరచి.. పరాయి భాషపై మమకారం పెంచుకుంటున్న యువత. పెదవి తెరిస్తే ఆంగ్లం తప్పా మరోభాష మాట్లాడేందుకు సంకోచించే యువత. ఇలాంటి కాలంలోనూ వైఎస్.. తన మాతృభాషపై మమకారం తగ్గించుకోలేదు.

డాక్టర్ డిగ్రీని పొందినా.. ఆంగ్లం అనర్గళంగా మాట్లాడ కలిగినా తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. పంచెకట్టు, ఖద్దరు చొక్కాతో కల్మషం లేని చిరునవ్వుతో కనిపించే వైఎస్.. తెలుగువారి పెద్దన్నగా కనిపించే వారు. కేవలం వస్త్రాధారణలోనే కాకుండా.. తన మాటల శైలిలోనూ తెలుగు పదాలతో ప్రజల హృదయాలాను దోచుకున్నారు.

అక్కల్లారా.. చెల్లెళ్ళలారా.. అన్నాల్లారా.. తమ్ముళ్ళారా.. అందరికీ నమస్తే.. అంటూ ఆప్యాయంగా పలుకరిస్తూ. అందరి మన్నలు పొందారు. తనకు కాస్త పరిచయం ఉంటే చాలు ఎదురు పడితే సమయం సందర్భం ఏదైనా, వాట్‌ సార్‌... అంటూ ఆప్యాయంగా పలకరించే వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి ప్రజల కష్ట సుఖాల్లో మమేకమై ప్రజల హీరోగా వారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందారు.

డాక్టర్‌ చదివినా ఎక్కడా తనలో దర్పాన్ని ప్రదర్శించకుండా అచ్చ తెలుగులో ఆప్యాయతగా పలకరించి, ఆకట్టుకునే మనసత్వం వైఎస్‌ సొంతం. వ్యవసాయమన్నా, పచ్చటి పొలాలన్నా ఆయకు ప్రాణం. ఏకాస్త వీరామం దొరికినా నేరుగా ఆయన తన కళల కోటగా నిర్మించుకున్న ఇడుపులపాయ ఎస్టేట్‌కు వెళ్తారు. అక్కడ పంట పొలాలు కలయ తిరుగుతూ.. పాడి పశువుల వీపు నెమురుతూ ఆయన పొందే ఆనందం అంతా ఇంతాకాదు.

కన్న తల్లిలాంటి సొంత గడ్డ, కడపపై ఆయనకు వల్లమాలిన ప్రేమ. మూడు పదుల రాజకీయ జీవితంలో తనవెన్నంటి ఉంటూ తన వరుస విజయాలకు పునాదులుగా నిలిచిన కడప ప్రజలంటే ఆయనకు పంచ ప్రాణాలు. తన వద్దకు ఏ ప్రాతం నుంచి వచ్చివారైనా.. వారు ఆశించే సహాయం ఏదైనా రిక్త హస్తాలతో వారిని నిరాశ పరిచ పంపడం ఆయన జీవితంలోనే కనిపించదు. ఇలా వచ్చే వారిలో బద్ధ శత్రువులు ఉన్నా వారికి తన చేతనైన సాయం చేయడం వైఎస్ నైజం.

వెబ్దునియా పై చదవండి