మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

డీవీ

సోమవారం, 20 మే 2024 (09:49 IST)
Ajith Kumar three shades
స్టార్ హీరో అజిత్ కుమార్‌తో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే హైదరాబాద్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 
తాజాగా మేకర్స్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. టైటిల్ కి తగ్గట్టు అజిత్ ని మూడు డిఫరెంట్ వేరియేషన్స్ లో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్ లో వైబ్రెంట్ అవుట్ ఫిట్స్, చేతినిండా టాటూస్, షేడ్స్ ధరించి ఎదురుగా వున్న వెపన్స్ తో అమెజింగ్ గా కనిపించారు అజిత్. మూడు లుక్స్ లో మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో మెస్మరైజ్ చేశారు. సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచిన ఈ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.    
 
ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అభినందన్ రామానుజం డీవోపీగా పని చేస్తుండడగా, విజయ్ వేలుకుట్టి ఎడిటర్.
ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు