02-01-2020 గురువారం మీ రాశిఫలాలు- ఇతరులపై మీరు చేసిన వ్యాఖ్యలు?

గురువారం, 2 జనవరి 2020 (05:01 IST)
మేషం : ఉద్యోగస్తులు కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఆందోళన తప్పదు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. శ్రమాధిక్యత, మానసిక ఒత్తిడి వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. కార్యసాధనలో ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొంటారు. 
 
వృషభం : ఆత్మీయుల తోడ్పాటు, మీ శ్రమకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. కలప, సిమెంట్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కొంటారు. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మలను మోసగించే ఆస్కారం ఉఁది. 
 
మిథునం : పత్రికా రంగంలోని వారికి ఏకాగ్రత ముఖ్యమం. రాజకీయాలో వారు తొందరపడి వాగ్ధానాలు చేయకండి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. మీ ఆగ్రహావేశాలు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
కర్కాటకం : హోటల్, తినుబండరాలు, బేకరీ పనివారలకు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉంది. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం కొరవడుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. బంధు మిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. 
 
సింహం : ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఒత్తిడి, చికాకులు తప్పవు. మీకు నచ్చని సంఘటనలు కొన్ని ఎదురుకావొచ్చు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. తెలియని ఉత్సాహం ధైర్యం, మీలో చోటుచేసుకుంటుంది. మిత్రుల నుండి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. ఊహించని విధంగా ధనప్రాప్తి లభించును. 
 
కన్య : రుణాల కోసం అన్వేషిస్తారు. మీ యత్నాలకు మీ శ్రీమతి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులపై మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిరు వ్యాపారులకు లాభదాయకం. 
 
తుల : ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాట పెట్టే అవకాశం ఉంది. ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమిస్తారు. వాతావరణంలోని మార్పుల వల్ల మీ పనులు వాయిదాపడతాయి. వైద్యులుక ఏకాగ్రత చాలా ముఖ్యం. 
 
వృశ్చికం : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. 
 
ధనస్సు : కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. ఇతరుల సాయం కోసం ఎదురుచూడకుండా మీ యత్నాలు సాగించండి. స్త్రీలు, టీవీ చానెల్స్ కార్యక్రమాల్లో రాణిస్తారు. 
 
మకరం : స్త్రీలు, విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ ఔదార్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. సభలు, సమావేసాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కుంభం : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలకు కళ్ళు, తల నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. ఫ్లీడర్, ఫ్లీడర్ గుమస్తాలకు మంచికాల. 
 
మీనం : మీకు రాబోయే ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. స్త్రీలకు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది. గట్టిగా ప్రయత్నిస్తేనే కాని మొండిబాకీలు వసూలు కావు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. స్పెక్యులేషన్ నిరుత్సాహపరుస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు