Chanakya niti: భార్యాభర్తల సంబంధం బలపడాలంటే.. చాణక్య నీతి?

సెల్వి

సోమవారం, 28 జులై 2025 (17:00 IST)
marriage
ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు ప్రస్తుతం నేరాల సంఖ్యను పెంచుతున్నాయి. వివాహిత పురుషులు తమ భార్యలను విడిచిపెట్టి ఇతర స్త్రీల పట్ల ఆకర్షితులవడానికి లేదా వివాహేతర సంబంధాలు కలిగి ఉండటానికి గల కారణాలను కూడా చాణక్య నీతిలో ప్రస్తావించారు. అయితే.. ఇలా వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. భార్య నుంచి విడిపోయిన తర్వాత చాలా సార్లు ఎవరు లేకుండా .. ఒంటరిగా మిగిలిపోతాడు.
 
భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి, అది విచ్ఛిన్నం కాకుండా నిరోధించడానికి చాణక్య నీతిలో అనేక మార్గాలను ప్రస్తావించింది. భార్యాభర్తల బంధం నిలబడాలంటే దంపతులు తరచుగా మాట్లాడుకుంటూ ఉండాలి. ఏదైనా సమస్య ఏర్పడితే.. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. 
 
భార్యాభర్తల మధ్య ప్రేమను కొనసాగించడానికి.. చిన్న చిన్న విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. అలాగే భార్యాభర్తలు ఒకరితో ఒకరు గడిపేందుకు సమయాన్ని కేటాయించాలి. ఇద్దరూ సంతోషంగా సమయం గడపాలని చెప్పారు చాణక్య.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు