01-03-2025 నుంచి 31-03-2025 వరకు మాస ఫలితాలు

రామన్

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (19:36 IST)
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. పట్టుదలతో శ్రమించి లక్ష్యాన్ని సాధిస్తారు. సర్వత్రా ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచికే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. అవివాహితులకు శుభయోగం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. పనులు వేగవంతమవుతాయి. ప్రకటనలు, ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఉద్యోగ, ఉపాధ్యాకులకు పదోన్నతితో కూడిన బదిలీ. శుభకార్యానికి హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సత్కాలం సమీపిస్తోంది. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఆదాయం బాగుంటుంది. రుణ సమస్యలు తొలగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదలనకు స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం యెగదాయకమే. లావీదేవీలు కొలిక్కివస్తాయి. వ్యవహారదక్షతతో రాణిస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. దంపతులకు కొత్త ఆలోచనులు స్ఫురిస్తాయి. స్థిరాస్తి అమర్చుకునే దిశగా యత్నాలు సాగిస్తారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి, గృహమరమ్మతులు చేపడతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. తరుచూ ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉపాధ్యాయ, ఉద్యోగస్తులు పురస్కారాలు అందుకుంటారు. విద్యార్థులకు ఏకాగ్రతలోపం, ఆందోళన అధికం. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహబలం స్వల్పంగానే ఉంది. ఆచితూచి అడుగు ముందుకేయండి. నిర్ణయం తీసుకునే ముందు పెద్దల అభిప్రాయం తెలుసుకోండి. ఏకపక్షంగా వ్యవహరిస్తే నష్టాలు తప్పవు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆప్తులతో సంభాషణ కార్యోన్ముఖులను చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెట్టండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆలస్యంగా అయినా పనులు సానుకూలమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. తరుచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్‌ను అలక్ష్యం చేయకండి. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గ్రహబలం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. ఆశావహదృక్పథంతో మెలగండి. కలిసివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితుల సాయంతో అవసరాలు నెరవేరుతాయి. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అవివాహితులకు శుభయోగం. చేపట్టిన పనులు మధ్యలో ఆపివేయెద్దు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పత్రాలలో మార్పుచేర్పులు సాధ్యపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. తరుచు విందులు, వేడుకల్లో పాల్గొంటారు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ సంకల్పబలమే కార్యసిద్ధికి తోడ్పడుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. దుబారా ఖర్చులు తగ్గించుకోవటం శ్రేయస్కరం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కుంటారు. కొందరి రాక అసౌకర్యం కలిగిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక శుభవార్త గృహంలో సంతోషం కలిగిస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. మీ చొరవతో శుభకార్యం నెరవేరుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు విశేష ఫలితాలిస్తాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. ప్రశసంలు, పురస్కారాలు అందుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట,
ఈ మాసం అనుకూలదాయకమే. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. అంచనాలు ఇంచుమించుగా ఫలిస్తాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు మునుపటి కంటే చురుకుగా సాగుతాయి. కొత్తవ్యక్తులతో తంగా సంభాషించండి. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలు ఎదురుకాకుండా జాగ్రత్త వహించండి. సామరస్య ధోరణితో సమస్యలు పరిష్కరించుకోవాలి. శుభకార్య యత్నాలు మొదలెడతారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు చేపడతారు. ఆస్తివివాదాలు కొలిక్కివస్తాయి. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అర్థాంతంగా ముగించిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. తరచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆహ్వానం, కీలకపత్రాలు అందుకుంటారు. ఊహించని సంఘటననలు ఎదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా మెలగండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఆశావహదృక్పధంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు.
 
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. గృహంలో అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచికేనని భావించండి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గృహ అలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. ఖరీదైన వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా మొండిధైర్యంతో పూర్తి చేస్తారు. పాత పరిచయస్తుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. సాంకేతిక రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం గ్రహసంచారం అనుకూలంగా ఉంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వాక్పటిమతో నెట్టుకొస్తారు. కీలక వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోగయోగ్యమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో జాగ్రత్త వహంచండి. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వైద్యపరీక్షలు చేయించుకోవటం శ్రేయస్కరం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థిక విషయాల్లో విశేష ఫలితాలున్నాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం దూకుడు అదుపుచేయండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు