ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలతో తలమునకలవుతారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
ప్రణాళికలు వేసుకుంటారు. ప్రముఖులకు చేరువవుతారు. పనులు సానుకూలమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. రావలసిన ధనం అందుతుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ధనలాభం ఉంది. పనుల్లో ఒత్తిడి అధికం. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు చేరవేసే వ్యక్తులున్నారని గమనించండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కష్టం ఫలించకున్నా కుంగిపోవద్దు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అనవసర జోక్యం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఖర్చులు విపరీతం. ఏకాగ్రతతో వాహనం నడపండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అనుమానాలకు తావివ్వవద్దు.
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. దుబారా ఖర్చులు అధికం. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
సంకల్పబలం కార్యోన్ముఖులను చేస్తుంది. లక్ష్యసాధనకు పట్టుదలతో శ్రమించండి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకలో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. చేపట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. రావలసిన ధనం అందదు. అవసరాలు నెరవేరవు. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణం నిరుత్సాహపరుస్తుంది.
శ్రమించినా ఫలితం ఉండదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు సామాన్యం. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణ విముక్తులవుతారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఉత్సాహంగా గడుపుతారు. ఖర్చులు అధికం, దూరపు బంధువులతో సంభాషిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. వ్యవహారాల్లో జాగ్రత్త. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. వాహన ఇతరులకివ్వవద్దు.