20-11-2022 ఆదివారం దినఫలాలు - ఆదిత్యుని పూజించడం వల్ల మీకు మనోసిద్ధి..
ఆదివారం, 20 నవంబరు 2022 (04:00 IST)
మేషం :- నోటీసులు, ప్రముఖుల నుండి లేఖలు అందుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్ధంగా నిర్వహిస్తారు. స్త్రీలు కొత్త పథకాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. విందులు, వినోదాల్లో కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
వృషభం :- ప్రతి విషయంలోను సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగాఉంటుంది. ఆర్భాటాలకు పోకుండా ధనవ్యయం విషయంలో ఆచితూచి వ్యవహరించండి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొదుతాయి. నూతన పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు.
మిథునం :- రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అసవరం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అసవరం. మీ బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులు సభ సమావేశాలలో పాల్గొంటారు.
కర్కాటకం :- ఆర్థిక విషయాలలో సమస్యలు తలెత్తినా ముఖ్యుల సహకారం వలన పరిష్కరింపబడతాయి. చేపట్టిన పనిలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. కీలకమైన వ్యవహరాల్లో మీరే సొంతంగా నిర్ణయం తీసుకోవటం క్షేమదాయకం. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
సింహం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయటం శ్రేయస్కరం. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు.
కన్య :- ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. వృత్తిపరంగా ఎదురైన ఆటంకాలు అధికమిస్తారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు నూతన వాతావరణం, పరిచయాలు సంతృప్తినిస్తాయి. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. అవివాహితులకు సరైన జోడీ దొరికే అవకాశం ఉంది.
తుల :- వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. స్త్రీలకు అకాలభోజనం, శ్రమాధిఖ్యత వలన స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. దైవ, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఎదుటి వారి విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఇంతకాలం మీరెదురు చూస్తున్న అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి.
వృశ్చికం :- పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారులకు కలసివస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం.
ధనస్సు :- నిరుద్యోగులకు ప్రయత్న పూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. కొత్త ఆలోచనలు అమలు చేయడం ద్వారా కృషి రంగంలో లక్ష్యాలు సాధిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. అయినవారే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. స్త్రీలలో నూతనోత్సాహం, హడావుడి చోటుచేసుకుంటాయి.
మకరం :- పుణ్యక్షేత్ర సందర్శనలు, వనసమారాధనలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. పత్రిక, వార్తా సంస్థలలోని వారు పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించాలి. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటం క్షేమదాకయం. బంధువులు సహకరించక పోవటంతో అసహనానికి గురవుతారు.
కుంభం :- సోదరీ, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఎమరుపాటు కూడదు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. భాగస్వామిక సమావేశాల్లో ప్రముఖుల ప్రస్తావన చోటు చేసుకుంటుంది. బంధువుల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
మీనం :- వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు, తగిన ప్రతిఫలం లభిస్తాయి. ట్రాన్ల్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెళుకువ అవసరం. వన సమారాధనలు, శుభకార్యాల్లో హడావుడిగా ఉంటారు. వ్యాపార రహస్యాలు గోప్యంగా ఉంచండి శ్రేయస్కరం.