పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. ప్రముఖుల సలహా పాటిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. దూర ప్రయాణం తలపెడతారు.
వ్యవహారాల్లో నిపుణుల సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. రుణ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు ఒక పట్టాన పూర్తి కావు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం వృధా కాదు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. విందులు, వేడుకల్లో పాల్గొంటారు.
మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించండి. మొండిగా పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలతో సతమతమవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. సన్నిహితుల హితవు మీపై పనిచేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వేడుకలు, వినోదాల్లో దూకుడు తగదు.