నల్లమిల్లి వెంకటరెడ్డి-గోకవరం: మీరు అమావాస్య శనివారం, మేష లగ్నము, శ్రవణ నక్షత్రం, మకర రాశి నందు జన్మించారు. ధనాధిపతి అయిన శుక్రుడు లాభస్థానము నందు కుజునితో కలియక వల్ల వర్తమానం మీకు అనుకున్నంత అభివృద్ధి లేదు. మీరు వ్యాపారంలో బాగుగా రాణిస్తారు. 2010 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2017 నుంచి 2026 వరకూ యోగాన్ని, ఆర్థికాభివృద్ధిని ఇస్తుంది. 2026 నుంచి శని మహర్దశ 19 సంవత్సరములు సత్ఫలితాలను ఇవ్వగలదు. అష్టలక్ష్మీ స్తోత్రం చదివిన మీకు శుభం కలుగుతుంది. దేవాలయాలలో కానీ తెల్లజిల్లేడు చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.