కొంతమంది స్త్రీలలో కాళ్లు, చేతులపై ఉండకూడనిచోట వెంట్రుకలు పెరుగుతాయి. ఇటువంటివారు హరి దళం మోదుగ పుల్లలు కాల్చిన బూడిదను సమభాగాలుగా తీసుకుని అరటి దుంప రసంతో మర్దన చేసి పైన రాస్తూంటే వెంట్రుకలు ఊడిపోయి తిరిగి పుట్టవు.
అదేవిధంగా గుర్తించని హార్మోన్ల ప్రభావం వల్ల బహిష్టులు ఆగి ఆగి వస్తుంటే మీ శరీర బరువు పెరుగుతుంది. ఒళ్లు పెరిగితే బరువు మాత్రమే కాదు, ఆకృతి కూడా వికారంగా మారుతుంది.
ఈ సమస్యను అధిగమించడానికి 5 తులాల నీరుల్లిపాయను ముక్కలు చేసి ఒక లీటరు నీళ్లలో కలిపి కాచి మూడవ వంతు నీరు మిగులునట్లుగా కాచి వడపోసుకుని అందులో బెల్లం కలుపుకుని మూడు వారాలపాటు తాగితే బహిష్టు సక్రమమై శరీరం చక్కగా ఉంటుంది.