కలబంద జ్యూస్ తీసుకుంటే.. లైంగిక పటుత్వం, రోగ నిరోధక శక్తి పెరుగుతుందట..

మంగళవారం, 25 అక్టోబరు 2016 (11:30 IST)
పార్కుల్లో, బీచ్‌లో కలబంద జ్యూస్ తెగ అమ్మేస్తుంటారు. ఆ జ్యూస్‌ ద్వారా ఆరోగ్యానికి మేలెంతో తెలుసుకోకుండా కళ్లు మూసుకుని ఓ గ్లాసుడు తాగేస్తుంటాం. అయితే కలబంద జ్యూస్‌ ద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే షాక్ అవుతారు. అవేంటో చూద్దాం.. కలబందలో అనేక ఔషధగుణాలున్నాయి. దీంట్లో 99.3 శాతం నీరుతో పాటు ఏ, బీ, విటమిన్లు, ఎంజైములు, మినరల్స్‌ పుష్కలంగా ఉన్నాయి. 
 
ఇందులోని ఎంజైమ్స్ పెయిన్ కిల్లర్స్‌గా బాగా పనిచేస్తాయి. కలబందను జ్యూస్‌ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. గుండె, హెపటైటీస్‌, కిడ్నీ సమస్యలను నివారిస్తుంది. లైంగిక పటుత్వాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచి మధుమేహాన్ని నివారిస్తుంది. కలబంద జ్యూస్ ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.  
 
ఇక చర్మాన్ని సన్ టాన్ నుంచి కలబంద కాపాడుతుంది. ఇది మంచి కూలింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఫేస్‌ మాయిశ్చర్‌గా, కేశాల సంరక్షణ కోసం బాగా ఉపయోగపడుతుంది. బట్టతలను నివారిస్తుంది. మొటిమలను తొలగిస్తుంది. చర్మం ముడతలు పడటాన్ని నిరోధిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి