కాకర గింజల చూర్ణం నీటితో, తేనెతో తీసుకుంటే?

సోమవారం, 27 నవంబరు 2017 (22:26 IST)
చాలామంది కాకరకాయలోని చేదును గమనించి దగ్గరకు రానియ్యరు. కానీ కాకరకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆయుర్వేదంలో కాకరకాయను కారవెల్లిక అని అంటారు. కాకరకాయలో జీర్ణవ్యవస్థను కాపాడే ఔషధ గుణాలున్నాయి. అరికాళ్ళ మంటలు ఉన్నప్పుడు చేతితో నలిపి పిండితే రసం వస్తుంది. ఈ రసాన్ని అరికాళ్ళకు రాస్తే మంట తగ్గిపోతుంది. రోజుకు ఒక పచ్చి కాకరకాయను తింటే ఉబ్బసం తగ్గిపోతుంది. రోజురోజుకు గుణం కనిపిస్తుంది. 
 
కడుపులోని ఏలిక పాములు పోవాలంటే కాకర గింజల చూర్ణం నీటితో, తేనెతో తీసుకోవాలి. రెండు లేక మూడుసార్లు తీసుకోవాలి. శరీరంలో నొప్పి ఉంటే కాకరకాయను తినాలి. కుక్కకాటుకు కాకరకాయను మందుగా వాడతారు. కుక్క కరిచిన చోట కాకర ఆకులను పిండి ఆ రసాన్ని వాడతారు. కాకరకాయను పచ్చిగా లేకుంటే వండుకుని అయినా తినాలి. 
 
కాకర రసాన్ని తరచూ పొగిలిస్తూ ఉంటే నాలుక పూత, పుచ్చు పళ్ళు  తగ్గుముఖం పడుతాయి. అంతే కాదు మధుమేహం కూడా అదుపులోకి ఉంటుంది. కాకరకాయ కూరను భోజనంతో తింటే సుఖ విరోచనం అవుతుంది. కాకర ఆకు రసాన్ని రోజూ కంటి చుట్టూ కనురెప్పలకు రాస్తే రేచీకటి తగ్గిపోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు