శీతాకాలంలో ఏర్పడే జలుబుకు అల్లంతో చెక్ పెట్టవచ్చు. అజీర్తిని నివారించడంలో అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరంకు చెక్ పెడుతుంది. అల్లంలోని కొన్ని ఔషధ గుణాలు రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. గుండెపోటును నిరోధిస్తాయి. తోలు తీసేసిన అల్లం ముక్కను దంచి ఒక కప్పు పాలలో చేర్చి మరిగించి.. వడగట్టి కలకండతో కలిపి తీసుకుంటే దగ్గు, జలుబును దూరం చేసుకోవచ్చు.
అలాగే అరస్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పుదీనారసం, ఒక స్పూన్ తేనె ఈ నాలుగింటిని కలిపి.. ప్రతి రోజూ ముడు పూటలా తీసుకుంటే.. పిత్త సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. అంతేగాకుండా మాంసాహారం అధికంగా తీసుకోవడం ద్వారా ఏర్పడే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కొవ్వును తగ్గించుకోవచ్చు. అల్లం రసంతో తేనెను కలుపుకుని రోజుకు మూడు పూటలా స్పూన్ మోతాదులో తీసుకుంటే జలుబు మటాష్ అవుతుంది.