బరువు తగ్గేందుకు రకరకాల పండ్లు, కూరగాయలు తీసుకుంటుంటాం. వ్యాయామాలు చేస్తూ వుంటాం. అయితే వీటికంటే రాగి పాత్రలో నీరు తాగడం ద్వారా బరువు తగ్గడం సులభమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రాగి పాత్రలో నీలు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. తద్వారా కొవ్వు, చెడు బ్యాక్టీరియా శరీరం నుంచి తొలగిపోతుంది.
రాగి పాత్రలో నీరు తాగడం ద్వారా అసిడిటీ, గ్యాస్ తగ్గిపోతుంది. కిడ్నీ ఇంకా లివర్‌ను చురుకుగా పనిచేయడంలో తోడ్పడుతుంది. రాగిలో ఉండే యాంటిబాక్టీరియా శరీరంలోని గాయాలను నయం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొంతమంది ఆరోగ్య పరంగా ఎంత యాక్టివ్‌గా ఉన్నా వారి వయసు మించి కనిపిస్తూ ఉంటారు. ఈ సమస్య నుంచి బాధ పడేవారు చాలా మందే ఉన్నారు.
ఇలాంటి వారు రాగి పాత్రల్లో నీరు తాగడం చేస్తుండాలి. అలా చేస్తే ముఖంపై ఉన్న మచ్చలు, ముడతలు వంటివి తగ్గిపోతాయి. రాగి పాత్రలో కనీసం 8 గంటలు ఉంచిన మంచి నీటిని రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.