బాలింతలు పచ్చళ్లు, పేస్ట్రీలు తీసుకోకూడదట..!

FILE
శిశువు జన్మించినప్పటి నుంచి బాలింతలు పోషకాహారం తీసుకోవాలి. పచ్చళ్లు, మైదాతో చేసిన ఆహార పదార్థాలను బాలింతలు తీసుకోకూడదని న్యూట్రీషన్లు అంటున్నారు. కేకులు, పేస్ట్రీలు, బిస్కట్లు, పఫ్‌లు తినడం వల్ల బాలింతలు బరువు పెరిగిపోతారు. అలాగే టీ, కాఫీలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఇనుము అందదు. అందుచేత బయట అమ్మే వస్తువులు బాలింతలు తీసుకోరాదు.

ఇంకా పాలిచ్చే తల్లులు రాజ్‌మా సెనగపప్పు, మొలకలు వంటి వాటిని తినడం వల్ల బిడ్డకు కడుపునొప్పి వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ బాలింతకి చక్కని పోషకాహారం అంటే ఈ రకం తృణధాన్యాలతో చేసిన పదార్థాలేనని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. తృణధాన్యాల్లోని మాంసకృత్తులు, జింక్, ఇనుము పుష్కలంగా ఉంటాయి.

పోషకాహారం కోసం గుడ్లు, పెరుగు, చీజ్, చేపలు, పండ్లు మొలకలు తినాలి. ఇనుము అధికంగా ఉండే ఎండు ఫలాలు, ఆకుకూరలు తీసుకోవాలి. అలాగే విటమిన్ సి లభించే జామ, టమాటాలు, నిమ్మ, ఉసిరి వంటివి ఎంచుకోవచ్చునని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి