మహిళలు ఉడికించిన కోడిగుడ్డును రోజులో అల్పాహారంగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. ఉదయం పూట తినే అల్పాహారంలో ఒక గుడ్డును తీసుకుంటే ఎంతో మేలు. తద్వారా శరీరానికి మాంసకృత్తులు అందుతాయి. రోజంతా చురుగ్గా ఉంటారు. సగటున గుడ్డు నుంచి ఆరు గ్రాముల ప్రొటీన్లు, 72 కెలొరీలు అందుతాయి. మాంసకృత్తులతోపాటూ మరికొన్ని పోషకాలు అందించే గుడ్డు బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆహారమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అలాగే మహిళలు 30 దాటాక క్యాల్షియం కోసం పాల ఉత్పత్తులను తీసుకోవడంతో పాటు ఎండబెట్టిన ద్రాక్షలు ప్రూన్స్ తీసుకోవడం మంచిది. క్యాల్షియం లోపిస్తే ఎముకలకు బలం తగ్గుతుంది. అందుచేత ఎండుద్రాక్ష మాదిరిగా ఉండే ప్రూన్స్ ఇప్పుడు సూపర్మార్కెట్లలో విరివిగానే దొరుకుతున్నాయి. వీటిని తగినన్ని తినడం వల్ల ఎముక సాంద్రత గణనీయంగా పెరుగుతుంది.