గర్భం ధరించిన తర్వాత మహిళలు తమ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని పదార్థాలను తీసుకోవడానికి దూరంగా వుండాలి. అవేమిటో తెలుసుకుందాము. షార్క్, స్వోర్డ్ ఫిష్, టూనా చేపలను గర్భిణీలు తీసుకోవడాన్ని దూరంగా పెట్టాలి. పచ్చి లేదా తక్కువగా ఉడికించిన మాంసం హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉండవచ్చు కనుక వాటిని తీసుకోరాదు.