* శరీరం రంగు, ధరించే దుస్తులను బట్టి ఎలాంటి బొట్టు పెట్టుకోవాలో నిర్ణయించుకోవాలి. అలాగే నుదురు ఆకృతిని బట్టి కూడా ఏ బొట్టు నప్పుతుందో చూసుకోవాలి. నుదురు చిన్నగా వుంటే కొంచెం పొడవుగా వుండే బొట్టు, ఆటీన్ ఆకారంలో వుంటే బొట్టు పెట్టుకోవాలి. నుదురు వెడల్పుగా వుంటే గుండ్రని బొట్టు మరింత అందాన్నిస్తుంది.
* నుదురు పెద్దగా వుండేవారు బొట్టును కనుబొమల మధ్య కాకుండా కొంచెం పైకి పెట్టుకుంటే అందంగా వుంటుంది. తెల్లని శరీరఛాయ గలిగిన వారికి ముదురురంగు బొట్టు ఆకర్షణీయంగా వుంటుంది. చామనఛాయ లేదా అంతకన్న కాస్త రంగు తక్కువగా వున్నవారైతే పింక్, ఆరంజ్, గంధపురంగు, లేత గులాబి రంగు, ఎరుపు రంగు బొట్టు కళగా వుంటాయి. కళ్ళు పెద్దవిగా వుంటే పెద్ద బొట్టు, చిన్నగా వుంటే కొంచెం చిన్నసైజు బొట్టు శోభాయమానంగా వుంటుంది.
* నుదురు పెద్దగా వున్నవారు పెద్ద బొట్టు పెట్టుకుంటే నుదురు పెద్దగా వున్న విషయం అంతగా తెలీదు. చిన్నవాళ్ళకి రకరకాల ఆకృతులు, మ్యాచింగ్ రంగుల బొట్టు పెట్టుకున్నా బావుంటుంది. కానీ మధ్యవయసు వారికి ఎరుపు, పింక్ వంటి రంగులు, గుండ్రటి బొట్టు నిండుదనాన్నిస్తుంది. పొట్టిగా వున్నవాళ్ళు పొడుగు బొట్టు పెట్టుకొంటే అందంగా, హుందాగా కనిపిస్తారు.