ముల్తానీ మట్టిలో కాస్త రోజ్‌వాటర్ కలిపి మొహానికి పట్టిస్తే అది కండరాలను పట్టి ఉంచి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. దాంతో ముడతలు పోయి చర్మం మృదువుగా తయారవుతుంది. వృద్ధాప్యం దూరమవుతుంది. ఇలా చేస్తే చర్మ కణాలను పునరుజ్జీవితం చేయటమేగాక.. చర్మంలోని మృతకణాలను, మలినాలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది. దాంతో చర్మం రంగు మెరుగవుతుంది. మొటిమలు, మచ్చలు కూడా ముల్తానీమట్టి షేషియల్‌వల్ల పోతాయి. ముల్తానీమట్టి మంచి క్లెన్సర్ కూడా.. ఇది చర్మరంధ్రాలు తెరచుకునేలా చేస్తుంది. చర్మాన్ని పొడిబారకుండా తేమగా ఉంచుతుంది. ముల్తానీ మట్టిలో కాస్త రోజ్ వాటర్ కలిపేసి మొహానికి పట్టించి అరగంట తరువాత కడిగేస్తే చర్మం తేటగా ఉంటుంది. మొటిమలూ మచ్చలూ తగ్గుతాయి. దీనిని ఏ చర్మానికయినా వాడవచ్చు. సాగరగర్భంలో దొరికే మట్టి ఎలాంటి చర్మం వారికయినా చక్కగా సరిపోతుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, అయొడిన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మకణాలకు నూతన శక్తిని అందిస్తాయి. మలినాలనూ విషతుల్యాలనూ తొలగించి మొహాన్ని మెరిపిస్తాయి.