మీ చర్మానికి తగ్గట్లు ఇలా మాయిశ్చరైజ్ చేసుకోండి

గురువారం, 3 నవంబరు 2011 (12:30 IST)
FILE
పొడిచర్మానికి...
* పండిన అరటిపండు గుజ్జు, అవకాడో, బొప్పాయి, గుడ్డు పచ్చసొన మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. గసగసాలు, పల్లీగింజల్లో సహజసిద్ధమైన నూనెలు ఉంటాయి. అందుకని వీటి పేస్ట్‌ను పూసుకుంటే ముఖచర్మం మెరుస్తూ ఉంటుంది. అలాగే నిర్జీవంగా ఉన్న చర్మానికి పెరుగు రాసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.

జిడ్డుచర్మానికి...
* గుడ్డులో తెల్లసొన వాడితే జిడ్డుచర్మం మెరుగవుతుంది. మెంతులు, కందిపప్పుల్ని కలిపి పేస్ట్ చేసి చర్మంపై రాసుకుంటే జిడ్డు తొలగిపోతుంది.

యాస్ట్రింజెంట్లు లేదా టోనర్లు
* కీరదోసకాయ, పైనాపిల్ (అనాసపండు), నిమ్మరసాలు ప్రకృతి ఇచ్చిన యాస్ట్రింజెంట్లు, ఇంట్లో వీటిని వాడే ముందు ముఖానికి ఆవిరిపెట్టాలి. ఇలాచేయడం వల్ల ముఖంపై రంధ్రాలు తేరచుకుని శుభ్రమవుతాయి. దీనివల్ల పోషకాలు సులభంగా చర్మంలోకి ప్రవేశించే వీలుంటుంది.

* మృదువైన, పట్టులాంటి చర్మం కావాలంటే స్నానానికి ముందే బేకింగ్‌సోడాను ఒంటికి పట్టించండి. ఇదే ముఖంపై ఉండే బ్లాక్‌హెడ్స్ నివారణకు కూడా ఉపయోగపడుతుంది.

* బాహుమూలాల్లో, పాదాల్లో దుర్వాసన వస్తుంటే కనుక వెనిగర్ బాగా పనిచేస్తుంది. వెనిగర్, నీళ్లు సమపాళ్లలో కలిపి డియోడరెంట్‌లకు బదులు వాడొచ్చు. అథ్లెట్స్ ఫుట్‌తో బాధపడేవాళ్లు వెనిగర్ ఫుట్‌బాత్ చేయడం వల్ల ఆ ఇబ్బంది పూర్తిగా పోతుంది.

* పసుపు చేసే లాభాలు అందరికీ దాదాపు తెలిసినవే. కాని పసుపు కంటికింద ఉండే నల్లటి చారల్ని, ఉబ్బును కూడా తొలగిస్తుందని చాలామందికి తెలియదు. పగిలిన మడమలను బాగుచేస్తుంది. పిగ్మెంటేషన్, ముడుతల్ని మెరుపునిస్తుంది.

* సన్‌బర్న్ బారినపడ్డ చర్నానికి ఆలివ్‌నూనె వాడాలి.

* గోరువెచ్చటి ఆలివ్‌నూనెలో గోళ్లను ముంచితే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రెడీమెడ్‌గా లభిస్తున్నాయి కదా! అని రసాయనాలతో కూడిన ఉత్పత్తులు వాడకుండా ఇంట్లో లభించే సౌందర్యసాధనాలు వాడడం వల్ల సొగసంతా మీ చేతుల్లో ఉంటుంది. ఇలా చేస్తే ఖర్చు తగ్గడంతో పాటు అందం, ఆనందం మీ చెంతే ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి